ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావో యిస్టుల మృతి

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావో యిస్టుల మృతి

రాయ్పూర్ : ఛత్తీస్ గఢ్, దంతెవాడ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన భీకర ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావో యిస్టులు ప్రాణాలు కోల్పో యారని ఎస్పీ అభిషేక్ పల్లవ్ శనివారం ఇక్కడ తెలిపారు. దంతెవాడ శాసనసభ నియోజక వర్గానికి జరగనున్న ఉప ఎన్నికల కోసం ముందు జాగ్రత్తగా భద్రతా బలగాలు గాలింపుల్ని చేపట్టినపుడు కుంత్రేమ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టలు లు ఒక్కసారిగా దాడి చేశారని చెప్పారు. దరిమిలా పరస్పర కాల్పులు అనివార్య మయ్యాయి. కొన్ని గంటల తర్వాత మావోల వైపు నుంచి కాల్పులు ఆగి పోయాయి. తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలిం చినపుడు మావో యిస్టుల మృత దేహాలు లభించాయని వివరించారు. వారు స్థానిక మలంగీర్ ప్రాంత సమితి సభ్యులు. వారిని ప్రాణాలతో సజీవంగా పట్టిచ్చిన , లేక హతం చేసిన వారికి ప్రభుత్వం రూ.ఐదేసి లక్షల నగదుబహుమతి ప్రకటించింది. మృతుల నుంచి ఇటలీ తయారీ 9 ఎంఎం తుపాకీ, బోర్ గన్ తో పాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. భాజపా నేత, దంతెవాడ శాసన సభ్యుడు భీమా మండా వీని మావోయిస్టుల నిరుడు ఏప్రిల్ లో కాల్చిచంపారు. దరిమిలా త్వరలో ఉపఎన్నికల్ని నిర్వహిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos