గర్భ శోకానికి ఊరట..?

గర్భ శోకానికి ఊరట..?

లఖ్నవ్: పురిట్లోనే చనిపోయిన బిడ్డను పూడ్చి పెట్టడానికి స్మశానానికి వెళ్లిన వ్యక్తికి మరో బిడ్డ దొరికింది. వారి ఆనందానికి అవధుల్లేవు. బరేలీకి హితేశ్ కుమార్ తన భార్య వైశాలి రాంపూర గార్డెన్ ఆస్పత్రిలో ప్రసవించింది. అయితే బిడ్డ పురిట్లోనే చనిపోయింది. దంపతుల గర్భశోకానికి అంతే లేదు. కడకు స్మశానంలో బిడ్డను పాతేందుకు గోయి తవ్వుతున్నపుడు అందులోనే ఒక సంచి వారి కంట పడింది. దాని నుంచి పసి కందు ఏడుపు వినిపించింది. తెరచి చూడగా అప్పుడే పుట్టిన బిడ్డను గుడ్డలో చుట్టి ఉంచారు. హితేష్ అంబులెన్స్లో ఆ బిడ్డను చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. బిడ్డ బరువు కేవలం 1.1 కేజీలు.నెలలు నిండక ముందే భూమి మీద పడిన బిడ్డ కావచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. బరువు తక్కువ బిడ్డలకు తక్కువ పరిమాణంలోఆక్సిజన్ చాలు. అందువల్లే బిడ్డను సంచిలో పెట్టిన బతికిందని వైద్యులు వివరించారు. సిచిని భూమిలో పూడ్చి కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే అయి ఉంటుందని అంచనా వేసారు. ఆ బిడ్డను అక్కడ ఎవరు వదిలి వెళ్లారో సీసీ కెమేరాల ఆధారంగా తెలుసు కుంటు న్నామని పోలీసులు తెలిపారు. ‘బిడ్డ ఏడుపు వినపడగానే మా బిడ్డే బతికిందని అనుకున్నా. ఏడుపు గుంతలోని సంచి నుంచి వచ్చింది. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆ బిడ్డను ఆస్పత్రికి తరలించాన’ని హితేశ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos