దయనీయ స్థితిలో ‘నానో’..

దయనీయ స్థితిలో ‘నానో’..

అడుగుపెట్టిన ప్రతి వ్యాపారంలోనూ గెలుపు బావుటా ఎగురవేసిన టాటా నానో విషయంలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన ఫలితాన్ని చవిచూసింది.మధ్య,పేద తరగతి ప్రజలకు రూ.1లక్షకే కారు అందించాలనే లక్ష్యంతో రతన్ టాటా 2008లో నానో కారును తీసుకువచ్చారు. తెరపైకి వచ్చిన నానో మొదట్లో సంచలనం సృష్టించే విధంగా కనిపించింది. ఆ మరుసటి ఏడాది మార్కెట్లోకి వచ్చినప్పుడు తొలినాళ్లలో బాగానే అమ్మకాలు జరిగినా, ఆ తర్వాత తీవ్రస్థాయిలో పతనమైంది.నానో కారు అమ్మకాలు నానాటికీ తీసికట్టుగా తయారవడమే కాదు, సంస్థ చరిత్రలోనే అత్యంత దారుణ వైఫల్యంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కారు మాత్రమే అమ్ముడైందంటే నానో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.గత తొమ్మిది నెలల్లో నానో కర్మాగారాల నుంచి ఒక్క కారు కూడా తయారుకాలేదు.ప్రస్తుతానికి అన్ని తయారీకేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోగా వచ్చే ఏడాదితో అధికారికంగా నానో అంతర్ధానం కానుంది.కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్లు నానో కారు ఇలా అంతర్ధానం కావడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఏమైనా మధ్య,పేద తరగతి వర్గాల ప్రజలకు రూ.1 లక్షకే కారు అందించాలన్న రతన్ టాటా ఆకాంక్ష,లక్ష్యం నుంచి పుట్టుకొచ్చిన నానో పయనం ఇలా దశాబ్దానికే ముగిసిపోతుండడం కొంత విషాదకరమే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos