చిరు ‘సిసిసి’ మీద నాని సెటైర్ !

  • In Film
  • September 7, 2020
  • 98 Views
చిరు ‘సిసిసి’ మీద నాని సెటైర్ !

“ఎప్పుడో ఒకసారి డబ్బులు అందించి, నెలకు సరిపడా సరుకులు అందిస్తే సినీ కార్మికులను ఆదుకున్నట్లు కాదు. మళ్లీ షూటింగులు ఎలా మొదలుపెట్టాలి అనేదానిపై దర్శకులు నటీనటులు నిర్ణయాలు తీసుకోవాలి. చిత్ర పరిశ్రమలో రోజువారీ కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని నెమ్మదిగా పనులు ప్రారంభించాలి” అని ‘వి’ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాని అన్న మాటలివి. త్వరలో ఆయన షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ‘టక్ జగదీష్’ అక్టోబర్ నుండి మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనుంది. కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పనులు నెమ్మదిగా మొదలు పెట్టాలని చెప్పడం వరకూ ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, నెలకు సరిపడా నిత్యావసరాలు అందిస్తే కార్మికుల ఆదుకున్నట్లు కాదని చెప్పడం చిరంజీవి నేతృత్వంలో ప్రారంభమైన ‘సిసిసి’ మీద వేసిన సెటైర్ ఏమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాని సదుద్దేశ్యంతోనే ఉన్నప్పటికీ అందులో ద్వందార్ధం కూడా ఉందేమో అని కొందరి సందేహం. కరోనా కాలంలో కార్మికులకు నిత్యావసరాలు అందించిన ఘనత సిసిసిదే మరి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos