తెల్ల జుట్టు వచ్చేసిందిరోయ్..

  • In Film
  • December 9, 2019
  • 139 Views

మొదటి నుంచి రొటీన్‌కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని మొదటిసారి ప్రతినాయక పాత్రలో నటిస్తున్న వీ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.గతంలో జెంటిల్మన్‌ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విలనిజం పండించిన నాని వీ చిత్రంలో తనలోని విలనిజాన్ని పూర్తిగా వెండితెరపై ప్రదర్శించనున్నాడు.ఇదిలా ఉండగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్‌ జగదీశ్‌ అనే కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధమైన నాని అందుకోసం పొడవాటి జుట్టు,గుబురు గడ్డం పెంచుతున్నాడు.అందులో భాగంగా ఓ ఫోటోను షేర్‌ చేసిన నాని తెల్ల జుట్టు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ తెల్ల జుట్టు వచ్చేసిందిరోయ్.. అంటూ షేర్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని పని అప్పుడే అయిపోయిందా? నానికి ఏజ్ అయిపోతుందా? అప్పుడే ఆ సమస్యా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

View this post on Instagram

Thella juttu vachesindhiroiii 😬 #SaltandPepper

A post shared by Nani (@nameisnani) on

తాజా సమాచారం

Latest Posts

Featured Videos