అల్లు అర్జున్‌ చిత్రంలో నానా పాటేకర్?

  • In Film
  • March 28, 2019
  • 142 Views
అల్లు అర్జున్‌ చిత్రంలో నానా పాటేకర్?

తన చిత్రాల మార్కెట్‌
పెంచడం కోసం బొమన్‌ ఇరానీ,ఉపేంద్ర వంటి పరభాష నటులను టాలీవుడ్‌కు దిగుమతి చేసుకున్న
దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తాజాగా మరొ బాలీవుడ్‌ విలక్షణ నటుడిని టాలీవుడ్‌కు
దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.అల్లు అర్జున్‌తో తెరకెక్కించనున్న
కొత్త చిత్రంలో ఓ కీలక పాత్రం కోసం విలన్‌గా,సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా పలు సినిమాల్లో
నటించి మెప్పించిన నానా పాటేకర్‌ను ఒప్పించడానికి త్రివిక్రమ్‌ ప్రయత్నిస్తున్నట్లు
సమాచారం.ప్రస్తుతం నానాతో సంప్రదింపులు జరుపుతున్నారని త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే
అవకాశం ఉందని తెలుస్తోంది.అల్లు అర్జున్‌తో తెరకెక్కించనున్న ఈ చిత్రం హాలీవుడ్‌ రొమాంటిక్‌
చిత్రం ఇన్వెన్షన్‌ ఆఫ్‌ లైయింగ్‌ అనే చిత్రానికి రీమేక్‌ అనే వార్తలు వినిపిస్తున్నాయి.గత
ఏడాది విడుదలైన రజనీకాంత్‌ చిత్రం కాలా చిత్రంలో విలన్‌గా నటించి నానా పాటేకర్‌ దక్షిణాదిలోకి
ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos