బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ నిషేధం

బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ నిషేధం

లక్నో : ఉత్తర ప్రదేశ్లోని బహిరంగ ప్రదేశాల్లో ముస్లింల ప్రార్థన (నమాజ్) చేయడాన్ని నిషేధించినట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ ఓం ప్రకాశ్ సింగ్ బుధవారం ఇక్కడ ప్రకటించారు. అలీగఢ్, మీరట్ తదితర ప్రదేశాల్లో ఈ నిషేధం అమల్లో ఉందని చెప్పారు. ఇక పై ఇది అన్ని నగరాలు, పట్టణాలకూ వర్తిస్తుందని వివరించారు. తెలిపారు. ఇలాంటి ఉత్తర్వులనే నిరుడు గౌతమ్ బంద్ నగర్ పోలీసులు జారీ చేశారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా బహిరంగ నమాజ్ను ఆయా ఉద్యోగులు నిర్వహించకుండా చూడాలని పారిశ్రామిక యాజమాన్యాలకు, బహుళజాతి సంస్థలకు కూడా పోలీసులు సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos