హోసూరులో అనుమానాస్పద మృతి

హోసూరులో అనుమానాస్పద మృతి

హోసూరు : హోసూరు బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక పాత బెంగళూరు రోడ్డు పెట్రోలు బంకు వెనుక భాగంలో గల ఓ ఇనుప దుకాణం ముందు గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారమందించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుని ఒంటిపై గాయాలు ఉండడంతో హత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. శవాన్ని హోసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos