ముత్తయ్యను ఉద్దేశపూర్వక ఎగవేతదారు

ముత్తయ్యను ఉద్దేశపూర్వక ఎగవేతదారు

ముంబై: ప్రముఖ వ్యాపారి ఏసీ ముత్తయ్య ను ఐడీబీఐ బ్యాంక్ సోమవారం ఇక్కడ ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించింది. ఆయన కో ప్రమోటర్ గా ఉన్న ఫస్ట్ లీజింగ్ సంస్థ బకాయి రూ.508.40 కోట్లు. ఆగస్టు 27 న ముత్తయ్య, ఫస్ట్ లీజింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రమోటర్/డైరెక్టర్ ఫారూక్ ఇరానీ బకాయి చెల్లించనందున ఈ మేరకు ప్రకటించింది. ఐడీబీఐ తోబాటు మరో మూడు బ్యాంకుల్ని వారు మోసగించారని 2017లో సీబీఐ కేసు దాఖలు చేసింది. ఆ మరుసటి ఏడాది సిండికేట్ బ్యాంకు కు రూ. వంద కోట్ల కు పైగా మోసం చేసారనే న ఆరోపణలపై సీబీఐ మరో కేసు నమోదుచేసింది. నకిలీ పత్రాలతో రుణాలు తీసుకుని, ఆ నిధులను దారి మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏసీ ముత్తయ్యకు 1994-95, 2001-02 సీజన్లకు గాను తమిళనాడు క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999 నుంచి 2001 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos