ఉద్యాననగరి చుట్టూ వారాంతపు విడిదులు..

  • In Tourism
  • September 27, 2019
  • 323 Views
ఉద్యాననగరి చుట్టూ వారాంతపు విడిదులు..

దక్షిణభారత దేశంలో ప్రకృతి అందాలకు,దట్టమైన అడవులకు,లెక్కకు మించి పర్యాటక ప్రాంతాలకు నిలయమైన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం అంటే ప్రతి ఒక్కరికీ మొదటగా మదిలో మెదిలేది సిలికాన్‌ సిటీ,గార్డెన్‌ సిటీ బిరుదులు.వందల ఎకరాల విస్తరించి ఉన్న కబ్బన్‌పార్క్‌, లాల్‌బాగ్‌ వంటి మహా ఉద్యానవనాలతో పాటు కాలనీల్లో ఉండే చిన్న చిన్న ఉద్యానవనాలు రోడ్లకు ఇరువైపులా,మధ్యలో భారీ వృక్షాలతో నగరమంతా పచ్చదనంతో అలరారుతుంటోంది.పర్యాటక దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగరంతో పాటు నగరం చుట్టూ ఉన్న పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాల గురించి ఒక్కసారి పరికిస్తే..

సావన్‌దుర్గ్‌ కొండలు..
బెంగళూరు నగరం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఎన్న సావర్‌దుర్గ కొండలు దేశంలోని అతిపెద్ద ఆహ్లాదకరమైన కొండలలో ఒకటిగా పేరుగాంచాయి. దేవాలయాలు,ప్రకృతి దృశ్యాలు,కొండల్లో వన్యప్రాణులు,పసుపు బుల్ బుల్, రాబందులు, సీతాకోక చిలుకలు ఇతర జీవజాతులతో అలరారుతున్న సావన్ దుర్గ కొండలు తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశం..

సావన్దుర్గ్ కొండలు..

సావన్దుర్గ్ కొండలపై ట్రెక్కింగ్..

శివగంగే పర్వత శిఖరం:
బెంగళూరు నగరం నుంచి 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివగంగె వారాంతాల్లో కుటుంబం లేదా స్నేహితులతో గడపడానికి చక్కటి పర్యాటక ప్రదేశం.ముఖ్యంగా రాక్‌ క్లైంబింగ్‌కు శివగంగె ప్రసిద్ధి చెందడంతో రాక్‌ క్లైంబింగ్‌ అంటే ఇష్టపడే సాహసీకులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.ఈ ప్రదేశంలో చూడదగ్గ కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి.

శివగంగే పర్వత శిఖరంపైకి చేరుకోవడానికి ఇలా..

నంది హిల్స్ :
ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లోనున్న చిక్కబళ్లాపురం జిల్లాలో ఉన్న నందిహిల్స్‌ పర్యాటకులకు వారంతాల్లో విడిదిగా మారింది.శీతాకాలం,వర్షాకాలంలో చూడడానికి మనోహరంగా ఉండే నందిహిల్స్‌కు వేసవికాలంలో బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు.ముఖ్యంగా నందిహిల్స్‌పై తేలియాడే మబ్బులు నందిహిల్స్‌కు ప్రత్యేక ఆకర్షణ.అలాగే నందిహిల్స్ కు దగ్గరలో భోగ నందీశ్వర ఆలయం ఉన్నది. నందిహిల్స్ చూటానికి వెళ్ళే వారు భోగ నందీశ్వర ఆలయంను కూడా సందర్శించవచ్చు.

నంది హిల్స్ :

మాకలి దుర్గ హిల్ ఫోర్ట్ :
బెంగళూరు-హైదరాబాద్‌ మార్గం మధ్యలో దొడ్డబళ్లాపురం పట్టణం సమీపంలో ఉన్న మాకాళీ కొండలు అత్యంత సుందరమైన ప్రదేశం.ఎటు చూసినా ఎత్తైన కొండలు,వన్యప్రాణులు,అక్కడక్కడా తారసపడే జలపాతాలతో మాకలి దుర్గ కొండలు ఆహ్లాదాన్ని పంచుతాయి.బెంగళూరు సిటికి దగ్గరలో ఉన్న గ్రానైట్ కొండ రాక్ ట్రెక్కింగ్ పర్యాటకులకు ఒక చక్కటి ప్రదేశం.రాత్రి సమయంలో ట్రెక్కింగ్‌ మాకలిదుర్గ మధుర జ్ఞాపంగా మిగిలిపోతుంది..

మాకాలి దుర్గ కొండల అందాలు..

మాకాలి దుర్గ కొండలపై యువకుల ట్రెక్కింగ్

రామనగర- రామదేవర బెట్ట :
బెంగళూరు నగరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనున్న రామనగర అతిపురాతమైన గ్రానూట్‌,మైసూరు సిల్క్‌కు చాలా ప్రసిద్ధి చెందింది.రామనగరలోని రామదేవరబెట్ట,ఎస్‌ఆర్‌ఎస్‌ హిల్స్‌,వరదరాజ దేవాలయం తదితర అనేక దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి.వీటితో పాటు రామదేవరబెట్టలోని రాబందుల సాంక్షరి,కన్వ జలాశయం చూడదగ్గ ప్రదేశాలు.రామదేవర బెట్టపై 
ట్రెక్కింగ్‌ చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వర్షాకాలంలో.ఏమాత్రం పట్టు తప్పినా అంతే సంగతులు.

రామదేవర బెట్ట

రామదేవర బెట్ట పై పట్టు తప్పారో..

అంతరగంగే:
వారాంతంలో రాత్రి ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ మరియు కావింగ్ కోసం బెంగుళూరు సమీపంలో ఉన్న అంతరగంగే బెస్ట్ ప్లేస్. ఈ కొండ ప్రాంతం కోలార్ జిల్లాలో ఉంది, చుట్టూ బండరాళ్లు మరియు ట్రెక్కింగ్ కు సౌకర్యవంతంగా ఉండే చిన్న చిన్న గుట్టలపై నైట్ ట్రెక్కింగ్ అత్యంత ఉత్తేజాన్ని కలిగిస్తుంది..

అంతరగంగె

తొట్టికల్లు జలపాతం-
బెంగళూరు నగరం నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనున్నతొట్టికల్లు ఫాల్స్ లేదా టికె ఫాల్స్ వారంతపు విడిదికి అద్భుతమైన ప్రదేశం.వాహనాలను కొద్ది దూరంలోనే పార్క్‌ చేసి మట్టిరోడ్డుపై నడుచుకుంటూ కొండల మధ్య దూకే తొట్టికల్లు జలపాతంలో స్నానం చేయడం ప్రత్యేక అనుభూతి.ఈ ప్రదేశం ట్రెక్కింగ్,పర్వతారోహణకు పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ది చెందింది.

తొట్టికల్లు జలపాతం

స్కందగిరి-కలవర దుర్గ :
చిక్కబళ్లాపురం జిల్లాలోని స్కందగిరి లేదా కలవర దుర్గ కూడా వారాంతపు విడిదికి ఎంతో ప్రసిద్ధి చెందింది.స్కందగిరి కొండల అంచు నుంచి కిందనున్న ప్రకృతి అందాలు చూస్తే భూమి అంచున నిల్చొని తిలకిస్తున్నట్లు భావన కలుగుతుంది.ఈ ఎత్తైన కొండలపై నుంచి సూర్యోదయం,సూర్యాస్తమయం చూడడం ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది. స్కందగిరి కూడా ట్రెక్కింగ్‌,రాక్‌ క్లైంబింగ్‌కు అనువైన ప్రదేశం కావడంతో సాహసీకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు..

స్కందగిరి-కలవర దుర్గపై సూర్యోదయం..

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ :
దేశంలో ట్రోపికల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ కు అతి పెద్ద బొటానికల్ గ్లాస్ హౌస్ గార్డెన్ చాలా ఫేమస్.బెంగళూరు సిటి సెంటర్లో ఉన్న లాల్ బాగ్ గార్డెన్ ప్రధాన పర్యాటక ప్రదేశంగా ఆకర్షణీయంగా ఉంది..

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్

టిప్పు సుల్తాన్ కోట :
బెంగళూరు లో ఉన్న ప్రధాన చారిత్రాత్మక కట్టడాల జాబితాలో టిప్పు సుల్తాన్ కోట ఒకటి.ఇస్లామిక్ వాస్తుశిల్ప కళకు తార్కాణంగా నిలిచే ఈ కోటను టేకుతో నిర్మించారు.కోట్ స్తంబాలు,ఆర్చ్‌లు,బాల్కనీలు ఈ ప్యాలెస్ కు ప్రధాణ ఆకర్షణ.మండుటెండల్లో సైతం చల్లగా ఉండడం ఈ ప్యాలెస్‌ ప్రత్యేకత..

టిప్పు సమ్మర్‌ ప్యాలెస్‌..

బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ :
బెంగళూరు నగరంలో ట్రెక్కింగ్,హైకింగ్ తో పాటు వన్యప్రాణి ఫోటోగ్రఫీకి ఉత్తమ ప్రదేశం. ఈ బయోలాజికల్ పార్క్ లో అక్వేరియం, సీతాకోక చిలుకల ఉద్యానవనం మరియు స్నేక్ హౌస్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ లో రాచనాగు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos