మరోసారి మనసు దోచుకున్న జొమాటో..

మరోసారి మనసు దోచుకున్న జొమాటో..

కొద్ది రోజుల క్రితం ఆహారానికి మతం లేదని అదే ఒక మతమంటూ హిందూయేతర వ్యక్తి తీసుకువచ్చిన ఆహారాన్ని నిరాకరించిన వ్యక్తికి సమాధానమిచ్చి ప్రజల మనసులు దోచుకున్న ఆన్‌లైన్‌ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటో మరోసారి ప్రజల మనసులు దోచుకుంది.తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ ముంబయి నగరానికి చెందిన ఓ బాలుడు తన తండ్రి మొబైల్‌లో జొమాటో యాప్‌లో బెలూన్లు,కార్లు,బహుమతులు కావాలంటూ జొమాటోకు రిక్వెస్ట్‌ పెట్టాడు.ఇది గమనించిన బాలుడి తండ్రి బాలుడు చేసిన మెసేజ్‌లను స్క్రీన్‌షాట్‌ తీసి జొమాటోకు ట్యాగ్చేస్తూ ట్విటర్లో పోస్ట్చేశాడు. నాలుగేళ్ల నా కొడుకు అమాయకత్వంతో జొమాటోకు తనకు నచ్చిన వస్తువులు తెమ్మని మెసేజ్చేశాడుఅని ట్వీట్లో పేర్కొన్నాడు.ఈ ట్వీట్కు స్పందించిన జొమాటో బాలుడు కోరిన బొమ్మలు పంపి ఆనందానికి గురిచేసింది. మరోసారి బాలుడి తండ్రి ట్విటర్లో పేర్కొంటూ.. తన కుమారుడికి జొమాటో బొమ్మలు పంపించి ఆశ్చర్యానికి గురిచేసిందని పోస్ట్చేశారు. వాటితో బాలుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని పేర్కొన్నారు.ఈ మొత్తం తతంగం ప్రస్తుతు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.జొమాటో స్పందించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయి ప్రశంసలు కురిపిస్తున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos