ముకుల్‌రాయ్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

ముకుల్‌రాయ్‌ ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేయాలి

కోల్కతా: ఇటీవలే అధికార తృణమూల్ కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన ముకుల్ రాయ్ తన ఎమ్మెల్యే పదవికి తక్షణం రాజీనామా చేయాలని విపక్ష నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా రాజీనామా చేయకపోతే ముకుల్ రాయ్పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద శాసనసభాపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. నాలుగేళ్ల కిందట తృణమూల్ను వీడి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ కమలం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. సీనియారిటీని పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు విపక్ష నేత పదవిని కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దాంతో కొగత వారం తృణమూల్ కాంగ్రెస్లోకి తిరిగివచ్చారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos