అపర కుబేరుడు…అంబానీ

  • In Money
  • September 25, 2019
  • 141 Views
అపర కుబేరుడు…అంబానీ

ముంబై : దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్ అంబానీ  ఆక్రమించారు. ఆయన ఆస్తుల విలువ రూ.3,80,000 కోట్లు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరన్ భారత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ముఖేశ్ అంబానీ వరుసగా ఎనిమిదోసారి అగ్ర స్థానంలో నిలిచారు. రూ. 1,86,500 కోట్ల సంపదతో హిందుజా కుటుంబం రెండో స్థానంలో ఉంది. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 1,17,100 కోట్లు. ఎర్సలార్‌ మిట్టల్ ఛైర్మన్ ఎల్ఎన్ మిట్టల్ రూ. 1,07,300 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ రూ.94,500 కోట్లతో అయిదో స్థానంలో ఉన్నారు. ఉదయ్ కొటక్, సైరస్ ఎస్ పూనావాలా, పల్లోంజి మిస్త్రీ, షాపూర్ పల్లోంజి, దిలీప్ సంఘ్వీ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. దేశంలో శ్రీమంతుల సంఖ్య కూడా పెరిగిందని ఐఐఎఫ్ఎల్ నివేదిక తెలిపింది. 2018 సంవత్సరంలో రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారు 831 మంది ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 953కు పెరిగింది. టాప్ 25 స్థానాల్లో ఉన్న సంపన్నుల మొత్తం సంపద మన దేశ జీడీపీలో 10 శాతానికి సమానమని నివేదిక పేర్కొంది.

తాజా సమాచారం