ముఫ్తీ నిర్బంధం మూడునెలలు పొడిగింపు

ముఫ్తీ నిర్బంధం మూడునెలలు పొడిగింపు

శ్రీనగర్ : జమ్ము-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. నిరుడు ఆగస్టు నుంచి నిర్బంధంలో ఉన్నఆమె పై కఠినమైన ప్రజా భద్రతా చట్టం (పిఎస్ఎ)కింద కేసు నమోదు చేశారు. గత నెల రోజులుగా ఆమె నివాస నిర్భందంలో ఉన్నారు. సంవత్సరం పాటు నిర్బంధంలోనే కొనసాగనున్నారు. మరో ఇద్దరు నేతలు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) నేత అలీ మహ్మద్ సాగర్, పిడిపికి చెందిన సర్తాజ్ మదానిలకు ఈ చట్టం కింద నిర్బంధాన్ని పొడిగించారు. షాఫేసల్, నయిమ్ అక్తర్, హిలాల్ అక్బర్లోన్ సహా పలువరు నేతలను పిఎస్ఎ చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos