బాండ్లు రాసివ్వం

బాండ్లు రాసివ్వం

న్యూ ఢిల్లీ: బాండ్లపై సంతకాలు పెట్టించుకుని రాజకీయుల్ని నిర్బంధం నుంచి విడుదల చేసినందుకు జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహ బూబా ముఫ్తీ శుక్రవారం ట్విటర్లో ఆగ్రహించారు. ‘నిర్బంధం నుంచి విడుదలైన వారితో బాండ్లపై సంతకాలు పెట్టించకున్నట్లు వార్తలు వచ్చాయి. వారి నిర్బంధమే చట్ట విరుద్ధమైనప్పుడు ఏ చట్టం కింది షరతులతో విడుదల చేస్తారు? చుక్కాని లేకుండా ప్రయాణిస్తున్న ఈ ప్రభుత్వం తనకు తానే ఉచ్చు బిగించు కుంటోంద’ని వ్యాఖ్యానించారు. జమ్మూ-కశ్మీర్లో్ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటననూ ఖండిం చారు. ‘అంతా సాధారణంగానే ఉంటే తొమ్మిది లక్షల మంది భద్రతా సిబ్బంది ఎందుకు పహారా కాస్తున్నారు? పాకిస్తాన్ నుంచి ఏదో ఆపద వస్తుందని వారు ఇక్కడ లేరు. ఆందోళనలను అణిచివేసేందుకే సైనికులను మోహరించార’ని ఆరోపించారు.బాండ్లపై సంతకాలు పెట్టేందుకు ముఫ్తి , మరి కొంద రు నేతలు నిరాకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos