వెనిజులాకు పెద్దన్న హెచ్చరిక

వెనిజులాకు పెద్దన్న హెచ్చరిక

వాషింగ్టన్: వెంటనే వెనిజులా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించకపోతే మరిన్ని కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం హెచ్చరించారు. అక్కడి సోషలిస్టు పార్టీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించేందుకు అమెరికా చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. వెనిజులా నుంచి చమురు కొనకుండా ఇతర దేశాల్ని అమెరికా కట్టడి చేయటంతో వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలియింది. లక్షలాది ప్రజలు ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల కోసం అల్లాడిపోయారు. దేశంలో బతకలేక 40 లక్షల మంది ప్రజలు పొరుగు దేశాలకు కట్టుబట్టలతో వలస వెళ్లారు. అయినా మదురో అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధం కాలేదు. మరోవైపు వలస దారుల విష యంలో వెనిజులా – కొలంబియా దేశాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దరిమిలా వెనిజులా దుందుడుకు చర్యకు దిగితే హెచ్చరించింది. గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ నేత మదురో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష నేత జాన్ గ్వైడో, అమెరికా నేతృత్వంలోని పశ్చిమదేశాలు ఆరోపించాయి. మదురో పదవి నుంచి తప్పుకుని స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరాయి. దీనికి మదురో అంగీకరించకపోవడంతో ఆంక్షలు విధించాయి.  కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించటమే అమెరికా. ఇతర దేశాల కుట్రగా ముదురో, ఇతర నేతలు విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos