కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులకు వాతే..

కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులకు వాతే..

వాహనాలు నడిపేటపుడు ప్రజల నిర్లక్ష్యం,నాణ్యమైన రోడ్లు వేయడంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం,కాంట్రాక్టర్ల కమీషన్లకు ఆశపడి అధికారుల ఉదాసీనత ఇవన్నీ వెరసి రోడ్డు ప్రమాదాల్లో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచేలా చేశాయి.రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వ్యక్తుల సంఖ్య ఏడాదికేడాది రెట్టింపు అవుతుండగా ఎంతోమంది గాయాలపాలవుతున్నారు.అందులో ఎక్కువశాతం యువతే ఉంటుండడం ఆందోళన కలిగించే పరిణామమం.దీనిపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో,కాంట్రాక్టర్లలో మార్పు కనిపించకపోవడంతో చట్టాలను కఠినతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.అందులో భాగంగా మోటారు వాహన చట్టాలను సవరణలు చేసి మునుపటి కంటే కొంచెం కఠినతరం చేసింది.దీనివల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆశించిన స్థాయిలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు కేంద్ర రవాణశాఖ భావిస్తోంది.1988లో తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేసి రూపొందించిన బిల్లు జూలై 23 లోక్సభలో పాస్ అయ్యింది. ఇప్పుడు రాజ్యసభలో కూడా పాస్ కావడంతో త్వరలోనే బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఇక రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లు ఎదురుచూస్తోంది. భారత రహదారులపై వాహనాలను ఎలా నడపాలో, రవాణా వ్యవస్థలో భారీ మార్పులను చేస్తూ బిల్లులో పొందుపర్చారు. ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేయడం, జరిమానాలు అమాంతంగా పెంచివేయడం వంటివి బిల్లులో పొందుపర్చింది ప్రభుత్వం.కొత్త చట్టంలో ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులతో పాటు రోడ్డు ప్రమాదాలకు నాణ్యతలేని రోడ్డు కారణంగా తెలిస్తే కాంట్రాక్టర్లకు కూడా జరిమానాలు,శిక్షలు విధించేలా సవరణలు చేశారు.కొన్ని సందర్భాల్లో రోడ్డు పనుల్లో నాణ్యత లేని కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయంటూ చెబుతున్న ప్రభుత్వం నాణ్యమైన రోడ్లు వేయకుంటే కాంట్రాక్టర్లను దోషులుగా తేలుస్తామని బిల్లులో పొందుపర్చింది. రోడ్డు నాణ్యత విషయంలో రాజీ పడకూడదని రోడ్లు కారణంగా మనిషి మృతి చెందితే కాంట్రాక్టర్లనే బాధ్యులగా పరిగణిస్తామంటూ బిల్లులో పేర్కొంది.1988 చట్టం ప్రకారం వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే 8 తరగతి పాసై ఉండాలి. అయితే అర్హతను తొలగిస్తే డ్రైవింగ్ స్కూలు నుంచైనా సర్టిఫికేట్ ఉంటే లైసెన్స్ జారీ చేయొచ్చని కొత్తగా సవరించిన చట్టం పేర్కొంటోంది. ఒకవేళ లైసెన్స్ కాలం ముగిస్తే ఏడాది సమయంలోగా కొత్త లైసెన్స్ను రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది.ఇక ప్రైవేట్ క్యాబ్లు తమ క్యాబ్లను నడపాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుదని కొత్త చట్టంలో తెలిపారు. అంతేకాదు ఐటీ చట్టం 2000ను తాము లోబడి ఉంటామని సంతకం చేయాల్సి ఉంటుంది.కొత్తగా అమలు చేయనున్న జరిమానాలు పరిశీలిస్తే..

జనరల్‌ రూ.500,రహదారి ఉల్లంఘన నియమాలు (new 177A) – రూ.Rs 500 – టిక్కెట్ లేకుండా ప్రయాణం (178)- రూ.Rs500 – అధికారుల పట్ల దురుసు ప్రవర్తన (179)- రూ. 2000 – లైసెన్స్ లేకుండా వాహనాలను అనధికారికంగా ఉపయోగించడం (180) – రూ.5000 – లైసెన్స్ లేకుండా వాహనం నడపడం (181)- రూ.5000 – అర్హత లేని డ్రైవింగ్ (182) కొ.10,000 – ఓవర్ టేక్ (182B)- రూ.5000 – ఓవర్ స్పీడ్ (183)- లైట్ మోటార్ వెహికిల్స్కు రూ.1000, మీడియా ప్యాసింజర్, హెవీకి రూ.2000 – డేంజరెస్ డ్రైవింగ్ (184) – రూ.5000 వేల వరకుడ్రంకన్ డ్రైవింగ్ (185)- రూ.10,000 – స్పీడింగ్/రేసింగ్ (189)- రూ.5,000 – పర్మిట్ లేని వాహనం (192A)- రూ.10,000 వరకుఅగ్రిగేటర్స్(లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన) (193) – రూ.25,000 నుంచి రూ. 1,00,000 వరకుఓవర్ లోడింగ్ (194) – రూ.20,000, అలాగే, ప్రతి అదనపు టన్నుకు రూ.2,000 – ప్రయాణీకుల ఓవర్ లోడింగ్ (194A) – ప్రతి అదనపు ప్రయాణీకుడికి రూ.1000 – సీటు బెల్టు (194 B) – రూ. 1,000 – టూవీలర్ ఓవర్ లోడింగ్ (194 C)- రూ.2,000 మరియు 3 నెలల పాటు లైసెన్స్ డిస్క్వాలిఫికేషన్ఎమర్జెన్సీ వెహికిల్స్కు దారి ఇవ్వకపోవడం (194E) – రూ.10,000 – గడువు ముగిసిన ఇన్సూరెన్స్‌ (196) – రూ.2,000

మైనర్ల చేతికి వాహనం ఇస్తే.. వాహనం ప్రమాదానికి గురైతే వాహనం ఓనరుని కానీ.. లేక మైనర్ గార్డియన్ను కానీ విచారణ చేస్తామని బిల్లులో ఉంది. ఇక హిట్ అండ్ రన్ కేసుల్లో వ్యక్తి మృతి చెందితే పరిహారం కింద రూ. 25 వేలు ఇప్పటి వరకు ఉండేదని అయితే దీన్ని రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు బిల్లులో పొందుపర్చారు. గాయపడ్డవారికి అందే పరిహారం రూ.12,500 ఉండగా దాన్ని రూ.50వేలుకు పెంచారు. ఇక యాక్సిడెంట్ ఫండ్ను కూడా కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు బిల్లులో తెలిపారు. ఇక ప్రమాదం జరిగిన గంటలోనే చికిత్స చేసేందుకు ఎలాంటి డబ్బులు బాధితుడిని నుంచి తీసుకోకూడదని కూడా చట్టంలో పొందుపర్చారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos