చిన్నదవుతున్న చందమామ

చిన్నదవుతున్న చందమామ

వాషింగ్టన్:చంద్ర గ్రహం నెమ్మదిగా కుంచించుకు పోతున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా తాజాగా వెల్లడించింది. అంతర్గత శీతలం, ఇతర కారణాలు ఇందుకు కారణాలని పేర్కొంది. చంద్ర గ్రహం దాదాపు 150 అడుగులకంటే ఎక్కువగా కుంచించుకుపోయనందున చంద్రుడి ఉపరి తలం ముడుచు కు పోవడం, ప్రకంపనలు సంభవించటం తదితర పరిణామాలకు దారి తీస్తాయని వివరించింది. గతంతో పోలిస్తే ఇప్పుడు చంద్ర గ్రహం ఎండు ద్రాక్షను తలపి స్తోందన్నారు. లూనార్‌ రీకానిసెన్స్‌ ఆర్బిటార్‌ తీసిన 12 వేలకు పైగా చిత్రాలను పరిశోధకులు విశ్లేషించి ఈ విషయాన్ని నిర్ధారించారు. చంద్రుడిఉపరితలం పెళుసుగా ఉన్నందున గ్రహిం కుంచించు కుపోయే కొద్దీ పగుళ్లు ఏర్పడ తాయని వివరించారు. భూ గర్భంలో మాదిరి చంద్రుడిలో టెక్టోనిక్‌ ప్లేట్లు లేవు. 4.5 బిలియన్‌ ఏళ్ల కిందట అవిర్భవించిన చంద్ర గ్రహంలోపలి వేడిమిని నెమ్మదిగా కోల్పోతున్నందున చంద్రునిలో టెక్టోనిక్‌ ప్రక్రియ జరుగుతోంది. ఫలితంగా జాబిల్లి ముడుచుకు పోతోందన్నారు. చంద్రుని ఉత్తర ధృవం సమీ పంలోని మారే ఫ్రిగోరిస్‌ ప్రాంతం పగుళ్లు ఏర్పడి ముందుకు కదులుతున్నట్లు తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos