గో ర‌క్ష‌కుడు మోను మ‌నేస‌ర్‌ అరెస్ట్‌

గో ర‌క్ష‌కుడు మోను మ‌నేస‌ర్‌ అరెస్ట్‌

చండీఘ‌ఢ్ : గోసంర‌క్ష‌కుడు మోను మ‌నేస‌ర్‌ను  హ‌రియాణ పోలీసులు మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకున్నారు. మ‌నేస‌ర్‌ను హ‌రియాణ పోలీసులు రాజ‌స్ధాన్ పోలీసుల‌కు అప్ప‌గించ‌నున్నారు. రాజ‌స్ధాన్‌కు చెందిన ఇద్ద‌రు ముస్లింల హ‌త్య కేసులో బ‌జరంగ్‌ద‌ళ్ స‌భ్యుడైన మోను మ‌నేస‌ర్‌పై ఫిబ్ర‌వ‌రిలో కేసు న‌మోదైంది. మోను మ‌నేస‌ర్ అలియాస్ మోహిత్ యాద‌వ్ బ‌జ‌రంగ్‌ద‌ళ్‌లో చురుకైన కార్య‌క‌ర్త కాగా గోర‌క్ష‌కుడుగా ఆయ‌న చెప్పుకుంటారు. గురుగ్రాం స‌మీపంలోని మ‌నేస‌ర్ మోహిత్ యాద‌వ్ స్వ‌స్ధ‌లం. రాజ‌స్ధాన్‌లోని భ‌ర‌త్‌పూర్ జిల్లా ఘ‌ట్‌మీక గ్రామానికి చెందిన నాసిర్‌, జునైద్ అనే వ్య‌క్తుల‌ను ఫిబ్ర‌వ‌రి 15న గోర‌క్ష‌కులు కిడ్నాప్ చేశారు. నాసిర్‌, జునైద్ మృత‌దేహాలు హ‌ర్యానాలోని భివానీలో మ‌రుస‌టి రోజు ద‌గ్ధ‌మైన కారులో ల‌భించాయి. ఈ కేసులో చార్జిషీట్ న‌మోదు చేసిన రాజ‌స్ధాన్ పోలీసులు మోను మ‌నేస‌ర్‌ను నిందితుడిగా చేర్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos