ఉగ్రవాదం పై ఉక్కు పాదం

ఉగ్రవాదం పై ఉక్కు పాదం

బిష్కేక్: ఉగ్ర వాదంపై ఉక్కు పాదం మోపాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమ్మేళనంలో పున రుద్ఘాటించారు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాల నిలువరించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎస్‌సీవో స్ఫూర్తి, ఆదర్శాలు మరింత బలాన్ని ఇస్తాయన్నారు. భారత్‌ను ఎదుర్కునేందుకు ఓ దేశం గత కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచిపోషించడమే తన విధానంగా చేసుకుందని పరోక్షంగా పాక్‌ను దుయ్యబట్టారు. ఉగ్రవాదం పీడ వదిలించేందుకు అన్ని దేశాలు కలిసి కట్టుగా ముందుకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదం, తిరుగుబాటుతో ధ్వంసమైన ఆ దేశం అభివృద్ధి చెందడం చాలా ముఖ్యమన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos