మహాబలిపురంలో మహా భేటీ

మహాబలిపురంలో మహా భేటీ

చెన్నై : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ తమిళ వస్త్రధారణతో కనిపించారు. క్రీమ్ కలర్ పంచెపై తెల్లటి చొక్కాను ధరించారు. జిన్‌పింగ్‌ విడిది చేసిన మహాబలిపురంలో ఆయనతో కలిసి మోదీ చారిత్రక కట్టడాలను సందర్శించారు. శోర్ ఆలయ ప్రాంగణాన్ని ఇరువురు నేతలు చుట్టి వచ్చారు. వెయ్యేళ్ల ఆలయ చరిత్రను, చారిత్రక కట్టడాలను ఈ సందర్భంగా జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. వారిద్దరు ఆలయ ప్రాంగణంలో భేటీ అయ్యారు. కొబ్బరి నీరు సేవిస్తూ వారు కొద్ది సేపు సేదతీరారు. అంతకుముందు మహాబలిపురంలో అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం, పంచ రథాలు కొలువు తీరిన ప్రదేశాలను వారు సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. శనివారం ఫిషర్‌మెన్‌ కోవ్ రిసార్ట్స్‌లో వారి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. చర్చల అనంతరం ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ గౌరవార్ధం లంచ్ ఏర్పాటు చేస్తారు.
విందులో దక్షిణాది రుచులు..
చైనా అధ్యక్షుడికి శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ ఇచ్చిన విందులో దక్షిణాదిలో పేరొందిన ప్రముఖ తమిళ వంటకాలు చోటు చేసుకున్నాయి. రసం, సాంబారు, కడై కుర్మా, కవనరసి హల్వాతో పాటు చెట్టినాడ్ నుంచి కారైకుడి వరకూ అన్ని ప్రాంతాల రుచులనూ మెనూలో చేర్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos