గద్దెపై మరోసారి మనోహర్ లాల్ ఖట్టర్

గద్దెపై మరోసారి మనోహర్ లాల్ ఖట్టర్

చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రమాణాన్ని చేయను న్నారని భాజపా వర్గాలు వెల్లడించాయి. శనివారం ఇక్కడ జరిగిన భారతీయ జనతా శాసన సభా పక్ష సమావేశం ఖట్టర్ను నేతగా ఎన్నుకుంది. వివాదాస్పద నేత, ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకునే ఆలోచనే లేదని భాజపా స్పష్టీకరించింది. ‘ఎవరికైనా మద్దతిచ్చే స్వేచ్ఛ గోపాల్ కందా కు ఉంది. కానీ మేం ఆయన మద్దతు తీసుకోవాలని అనుకోవట్లేదు. ఆయనను ప్రభుత్వంలోకి తీసుకుంటామనే ప్రశ్నే లేదు’ అని భాజపా నేత అనిల్ విజయ్ కుండ బద్ధలు కొట్టారు.ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించేంతటి బలం ఏ పార్టీకి లభించలేదు. దరిమిలా జన్ నాయక్ జనతా పార్టీ మద్దతుతో భా జ  పా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రిగా ఖట్టర్ ప్రమాణాన్ని చేసిన తర్వాత సభలో తమ బలాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos