గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన స్టాలిన్‌

గవర్నర్  ప్రసంగాన్ని బహిష్కరించిన స్టాలిన్‌

చెన్నై: తమిళనాడు శాసనసభలో సోమవారం గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రసంగాన్ని విపక్ష డీఎంకే సభ్యులు బహిష్క రించారు. గవర్నర్ ప్రసంగిస్తున్కనపుడు విపక్ష నేత స్టాలిన్ కొన్ని అంశాలను ప్రస్తావించినందుకు గవర్నర్ ఆక్షేపించారు. ‘మీరు మంచి వక్తే. సభలో చర్చ సమయంలో మీ నైపుణ్యాలను ప్రదర్శించండి’ అని ఎద్దేవా చేసారు. దీనికి డీఎంకే సభ్యులు అభ్యంతరం తెలిపారు. విపక్ష నేతను మాట్లాడనీయాలని కోరారు. ‘మీరు తర్వాత చర్చించండ’ని గవర్నర్ పలుమార్లు సూచించ డంతో డీఎంకే సభ్యులు సీఏఏ వ్యతిరేక నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం స్టాలిన్ విలేఖరులతో మాట్లాడారు. ‘పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, ఆర్థిక సంక్షోభం సహా ఎన్నో అంశాలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగానికి, లౌకికవాదానికి వ్యతిరేకమైన సీఏఏను పార్లమెంటు ఉభయసభల్లోనూ అన్నాడీఎంకే మద్దతిచ్చింది. ఎవరి ప్రయోజనాల కోసమో వారంతా పనిచేస్తున్నారు. అందుకు నిరసనగానే మేము గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిం చామ’ని చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా తమ నిరసన తెలిపేందుకే సభ నుంచి వాకౌట్ చేశామని ఏఎంఎంకే ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ తెలిపారు. ‘సవరణ చట్టం ముస్లింలకు, శ్రీలంక తమిళులకు వ్యతిరేకం. ఇండియా లౌకికవాద దేశం’ అని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos