అయోధ్య రామాల‌యం బీజేపీ, ఆరెస్సెస్ ఆస్తి కాదు

అయోధ్య రామాల‌యం బీజేపీ, ఆరెస్సెస్ ఆస్తి కాదు

పాట్నా: ఆర్జేడీ నేత మిసా భారతి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం కేవలం బీజేపీ, ఆరెస్సెస్ల ఆస్తి కాదని అన్నారు. తాము కూడా హిందువులం, సనాతనులమేనని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాము పని ఒత్తిడితో బిజీగా ఉన్నామని, వీలుచూసుకుని రాముడి దర్శనానికి వెళతామని అన్నారు. రామాలయం వెళ్లకుండా ఏ ఒక్కరైనా తమను ఆపుతారా అని మిసా భారతి ప్రశ్నించారు. ఇక ఆర్జేడీని వీడి మళ్లీ బీజేపీతో కలిసి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ), ఎన్డీయేతో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. నవాడాలో జరిగిన ఎన్డీయే సభలో ప్రధాని మోదీతో కలిసి నితీశ్ కుమార్ వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 మందికి పైగా స్ధానాలను దక్కించుకుని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని నితీష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రసంగం తర్వాత నితీశ్ కుమార్ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆయన పాదాలు తాకారు. దీంతో ఆయనలో జోష్ నింపేందుకు మోదీ ప్రయత్నించారు. ‘మీరు ఇంత మంచి ప్రసంగం ఇచ్చారు. నేను మాట్లాడటానికి ఏమీ మిగిలి లేదు’ అని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos