తెదేపాకు మైనార్టి దెబ్బ

తెదేపాకు మైనార్టి దెబ్బ

విశాఖపట్నం : తెదేపా విశాఖ నగర అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు రెహమాన్ గురువారం ఇక్కడ ఆ పార్టీకి రాజీనామా చే శా రు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ‘కార్యనిర్వహక రాజధానిగా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగస్తున్నాను. చంద్ర బాబు ఏం చర్యలు తీసుకున్న భయపడేది లేదు. విశాఖ నగర పాలక సంస్థకు కేంద్రం నిధులు రాకుండా చంద్ర బాబే అడ్డు కున్నా రు. ఆయన పుత్రరత్నం రాజకీయాల్లోకి ప్రవేశించాక.. మేము చంద్రబాబుకు దూరమయ్యాం. ఎన్నార్సీ వల్ల కొందరు భారతీయుల్లో అభద్రతాభావం ఏర్పడింది. దీన్ని వ్యతిరేకించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం మాకు సంతోషాన్ని కలిగించింది. రాష్ట్రంలో ఎన్నార్సీని అమలు చేయబోమని ప్రకటించిన జగన్కు ముస్లింలందరూ రుణపడి ఉన్నా రు. ఎన్నార్సీని వ్యతిరేకించిన జగన్ను విమర్శించాలని చంద్రబాబు మాకు ఆదేశాలు ఇచ్చారు. మాకు అను కూల మైన నిర్ణ యాన్ని తీసుకున్న జగన్ను ఎలా వ్యతిరేకిస్తాం. ఎన్నార్సీపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టీకరించాలి. విశాఖను రాజధాని చేఆయలని మేము గతంలోనే కోరాం. అందుకోసం పోరాటాన్ని కూడా చేసాను. చంద్రబాబు విధానాల వల్ల పార్టీ కార్యకర్తలు సం తో షంగా లేరు. కొందరు నాయకులు మాత్రమే బాగుపడ్డారు. రాజధాని అనేది విశాఖ ప్రాంతవాసుల కల’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos