ఆలస్యంగా వచ్చినందుకు రూ.50లక్షల స్వీయ జరిమానా..

సభకు నిర్ణీత సమయం కంటే నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చినందుకు మంత్రి హరీశ్ రావు తనకు తాను రూ.50లక్షల జరిమానా విధించుకున్నారు.ఈ ఘటన సొంతజిల్లా సిద్దిపేటలో చోటు చేసుకుంది.జిల్లాలోని దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమానికి నాలుగు గంటల పాటు ఆలస్యంగా చేరుకున్నారు.సభకు రాగానే తన కోసం నాలుగు గంటలుగా వేచిచూస్తున్న మహిళలకు క్షమాపణలు చెప్పారు.చేసిన తప్పునకు జరిమానా విధించాలంటూ మహిళలను కోరారు.దీంతో మహిళా భవనం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు. దీంతో హరీష్ రావుమహిళా భవన నిర్మాణానికి యాభై లక్షలు మంజూరు చేయిస్తానని చెప్పి తనకు తాను పరిహారం చెల్లించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక ఈ బాధ్యత తనకు తాను జరిమానాగా విధించుకున్నానని సభా ముఖంగా తెలిపారు హరీష్ రావు. ఇక మహిళలకు హామీ ఇచ్చింది తడవుగా వెంటనే ఈఎన్సీ కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి నిధులను మంజూరు చేయించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos