‘అయినా రైతుల వెంటే ’

‘అయినా రైతుల వెంటే ’

న్యూ ఢిల్లీ: రైతుల ఆందోళనకు మద్దతిచ్చిన మోడల్ మియా ఖలిఫాకు వ్యతిరేకంగా ‘మియా ఖలిఫా, కాస్త స్పృహలోకి రండి’ అని నినాదాలు రాసిన అట్టలతో కొందరు నిరసన చేపట్టారు. వీటికీ మియా ఖలిఫా ఘాటుగా స్పందించింది. ‘‘ఇప్పుడిప్పుడే మరోసారి స్పృహలోకి వచ్చాను. చెప్పాల్సిన అవసరం లేకపోయినా నా పై మీ పట్టిం పుకు ధన్యావాదాలు. ఇప్పటికీ నేను రైతులకే మద్దతు ఇస్తున్నాను’ అని శుక్రవారం ట్విట్టర్లో తేల్చి చెప్పింది. తనతో పాటు రిహన్నా, గ్రెటా థన్బర్గ్కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న నిరసనకారుల చిత్రాలను ట్విట్టర్లో షేర్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos