మెక్సికో ఓపెన్‌ విజేత కిరియోస్

  • In Sports
  • March 4, 2019
  • 155 Views
మెక్సికో ఓపెన్‌ విజేత కిరియోస్

మెక్సికో : ఆస్ట్రేలియా టెన్నిస్ ఆటగాడు నిక్ కిరియోస్ ఈ ఏడాది బోణీ కొట్టాడు. మెక్సికో ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 6-3, 6-4 తేడాతో ప్రపంచ మూడో ర్యాంకు ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించడం ద్వారా కెరీర్‌లో అయిదో సింగిల్స్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. రూ.2.61 కోట్ల ప్రైజ్మనీని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 72వ స్థానంలో ఉన్న కిరియోస్ ఈ టోర్నమెంట్లో పలు సంచలనాలకు కారకుడయ్యాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్, క్వార్టర్ ఫైనల్లో మూడు గ్రాండ్‌స్లామ్‌లను సొంతం చేసుకున్న స్విట్జర్లాండ్ కు చెందిన స్టానిస్లాస్ వావ్రింకా, సెమీ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకు ఆటగాడు, అమెరికాకు చెందిన జాన్ ఇస్నెర్‌లను ఓడించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos