అన్నదాతల స్మారకానికి పునాది రాయి

అన్నదాతల స్మారకానికి పునాది రాయి

న్యూ ఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల్లో మరణించిన రైతులకు గుర్తుగా తలపెట్టిన స్మారకానికి బుధ వారం ఉదయం గాజీపూర్ -ఘజియా బాద్(యూపీ గేట్) సరిహద్దులో భారత కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పునాది వేశారు. నిరసనల్లో మొత్తం 320 మంది రైతులు మరణించారు ఆయా రైతులకు గుర్తుగా వారి గ్రామాల నుంచి మట్టిని తీసుకువచ్చారు. స్వాతంత్య్రోద్యమ అమరవీరులు నివసించిన ప్రాంతాల నుంచీ మట్టిని తీసుకొచ్చి వినియోగించనున్నట్టు తెలిపారు. అమర వీరుల స్మారకం నిర్మాణం కోసం ‘మిట్టి సత్యాగ్రహ యాత్ర’ను బీకేయూ నిర్వహించింది. 50 మంది సామాజిక కార్యకర్తల బృందం అన్ని రాష్ట్రాల నుంచి మట్టిని సేకరించింది. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్ర శేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల గ్రామాల నుంచి మట్టిని సేకరించినట్లు బీకేయూ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos