బంగ్లా హిందువులు బాగున్నారు

బంగ్లా హిందువులు బాగున్నారు

ఢాకా: జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా లౌకికవాద దేశంగా ఉన్న భారత్ పేరు మసగబారే అవకాశం ఉందని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఏకే అబ్దుల్ మోమన్ వ్యాఖ్యానించారు. ‘భారతదేశం లౌకికవాదాన్ని విశ్వసిస్తున్న దేశం. ప్రస్తు తం తీసుకున్న నిర్ణయం కారణంగా చారిత్రాత్మకంగా అది బలహీనపడే అవకాశం ఉంద’ న్నారు. పీడనకు గురౌవుతున్న మై నా ర్టీ దేశాల జాబితాలో బంగ్లాదేశ్ను చేర్చినందుకు అసంతృప్తి చెందారు. ‘మతసామరస్యం ఉండే అతి కొన్ని దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. భారత్ కేంద్ర హోంమంత్రి అమిత్షా కొన్ని నెలల పాటు బంగ్లాదేశ్లో ఉంటే ఆయన మా దేశంలో ఆదర్శనీయమైన మత సా మ ర స్యా న్ని చూస్తారు. భారత్ ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. వాటితో పోరాడాలి. స్నేహపూర్వకంగా ఉండే మా మీద వాటిని రుద్దకూడదు. ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలపై దీని ప్రభావం పడకుండా భారత్ చూసుకుంటుందని భావిస్తున్నాన’ ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos