మేఘాలయలో జనాందోళన

మేఘాలయలో జనాందోళన

షిల్లాంగ్: పౌరసత్వ చట్ట సవరణ వల్ల ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమం టున్నాయి. అస్సాం, త్రిపుర, మేఘాలయలో పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. మేఘాలయలో అంతర్జాల సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిషే ధిం చింది. ఎస్ఎంఎస్, వాట్సప్, ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ సేవలూ ఆగిపోయాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారినం దున తూర్పు కాశీ హిల్స్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అస్సాంలోని పది జిల్లాల్లో బుధ వారం నుంచి ఇంట ర్నెట్ సేవలు నిలిపివేయగా ప్రభుత్వం ఈ నిషేధాన్ని మరో 48 గంటల పాటు పొడిగించింది. గుహవటి, డిబ్రూగర్లో కర్ఫ్యూ అమల్లో ఉన్నా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos