మోదీ విలాసం… వందలాది విలాపం

మోదీ విలాసం… వందలాది విలాపం

భోపాల్:ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కడి సంతోషం కోసం వందల మందిని నీటిలో ముంచారని ‘నర్మదా బచావో’ ఆందోళన నేత, సామాజిక ఉద్యమ కారిణి మేధా పాట్కర్ విమర్శించారు. మోదీ పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం కోసం ఎంతో మంది నీటిలో మునిగిపోవాలా అని ప్రశ్నించారు. బుధవారం మధ్యప్రదేశ్లోని బర్వానీ, అలిరాజ్ పూర్ జిల్లాల్లో మేధా పాట్కర్ పర్యటించారు. నర్మదా నదిపై ఉన్న మానస సరోవర్ డ్యాంలో నీళ్లు నిలప డం వల్ల సుమారు 192 గ్రామాలు నీట మునిగాయన్నారు. మోదీ తన పుట్టిన రోజును ఒక వేడుకలా జరుపుకుంటున్నారు. ప్రజలకు కనీస పునరా వా సాలు లేవు. సెప్టెంబర్ 17న మోదీ పుట్టిన రోజు వేడుకల కోసం సర్దార్ పటేల్ మానస సరోవర్ జలాశయంలో భారీ స్థాయిలో నీరు నిల్వ చేసి వందల మందిని నీటిలో ముంచారని మండి పడ్డారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని అటక ఎక్కించి బాధితులకు ఇప్పటికీ పరిహారాన్ని చెల్లించ లేదని దుయ్య బట్టారు. గుజరాత్ ప్రభుత్వం నుంచి మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సి రూ.1,857 కోట్ల బకాయి కొన్నేళ్లుగా రాలేద’ని తప్పుబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos