ఫిబ్రవరి 16 నుంచి మేడారం జాతర

ఫిబ్రవరి 16 నుంచి మేడారం జాతర

మేడారం: ఇక్కడ జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జాతర జరగనుండడం సర్కారుకు ప్రతిష్ఠాత్మకం కానుంది. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. జాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. భక్తులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. అర గంటలో దర్శనం పూర్తయ్యే విధంగా ప్రణాళికలను అమ లు చేస్తా మన్నారు. విదేశీ భక్తులు ఎక్కువ మంది రావచ్చని ఆశించారు. 8 వేలకు పైగా ఆర్టీసీ బస్సులు నడపుతారు. ట్రాఫిక్ రద్దీకి తగిన చర్యలు తీసుకుంటు న్నామని వివరించారు. రెండేళ్లకోసారి జాతర జరుగుతుంటుంది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు వస్తా రు.. ఫిబ్రవరి 16న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను, 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెల పైకి తీసుకొస్తారు.18న భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. 19న అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos