పేదల పొట్ట కొడుతున్న పాలకులు

పేదల పొట్ట కొడుతున్న పాలకులు

లఖ్నవూ: ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజల్ని పాలకులు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల్ని పెంచి మరింత హింసిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి మంగళవారం ట్విట్టర్ లో విమర్శించారు. శ్రమ జీవుల పొట్టకొడుతూ దేశ ఖజానా నింపాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని మండి పడ్డారు. ‘‘దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి నిత్యావసర వస్తువుల ధరలను అనవసరంగా పెంచుతున్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో కుదేలైన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది సరిపోనట్లు నిత్యవసర ధరలు పెంచుతూ వారిని మరింత హింసిస్తున్నారు. ఈ ప్రాణాంతక పన్నుల్ని పెంచుతూ ప్రజా సంక్షేమం కోసం నిధులు సేకరించాలని ప్రభుత్వం వాదిస్తోంది. ఇది ఎంత మాత్రం సముచితం కాదు.పెట్రోల్, డీజిల్ మొదలైన వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంత రాయం ఏకపక్షంగా పన్నులు పెంచుతూ పోతున్నాయి. ఇది ప్రజలకు మోయలేని భారంగా తయారవుతోంది. దీన్ని ప్రభుత్వాలు వెంటనే కట్టడీ చేయాలి. దేశంలోని కోట్లాది మంది పేదలు, శ్రమజీవులు, మధ్యతరగతి ప్రజల పొట్ట కొట్టి ప్రభుత్వ ఖజానా నింపాలని చూడొద్దు. వారి కోసం ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు వారి నుంచే తీసుకుంటున్నాయి’’ అని ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos