భూతల స్వర్గం అండమాన్‌ ద్వీపం..

భూతల స్వర్గం అండమాన్‌ ద్వీపం..

బాహ్య ప్రపంచానికి దూరంగా బంగాళాఖాతం సముద్రం మధ్యలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు భూతల స్వర్గాన్ని తలపించే అనేక ద్వీపాలకు నెలవు.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మయబండర్ ద్వీపం గురించి.రేహిల్స్,అవీస్,ఇంటర్వ్యూ,ఆస్టిన్ ఎక్స్ ఇలా పలు రకాల మరిన్ని అందమైన ద్వీపాల సమూహంగా ఉన్న మయబండర్ ద్వీపం రెండు రోజుల పర్యటనకు అనువైన పర్యాటక ప్రాంతం.
ఆస్టీన్ ఎక్స్ :
ఇప్పుడిప్పుడే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ఆస్టిన్ ఎక్స్ ద్వీపం చుట్టూ సముద్ర తీరాలు,చిన్న చిన్న గుట్టలతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.ఫోటోగ్రఫీతో పాటు పలు జలక్రీడలకు సైతం స్వర్గధామంగా పేరు గాంచడంతో ఆస్టిన్ ఎక్స్ ద్వీపం పర్యటనకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలు పర్యాటకులు తరలివస్తున్నారు. అంతేకాదు ఇక్కడి ప్రజలు పర్యాటకులతో చాలా స్నేహపూర్వకంగా మెలుగుతూ ఎక్కడికి వెళ్లడానికైనా తోడుగా ఉండడం పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించడానికి కారణమవుతోంది.

ఆస్టీన్ ఎక్స్ ద్వీపం.


అవీస్ ఐల్యాండ్ :
బంగారు వర్ణంలో మెరిసిపోయే అవీస్ ద్వీపం సముద్ర తీరం కొబ్బరిచెట్లతో మరింత అందంగా,పచ్చగా కనిపిస్తూ ఆహ్లాదపరుస్తుంది.రెండు గంటల్లో మొత్తం చుట్టేయగలిగే ఈ ద్వీపం ఉదయం వేళల్లో చూడడానికి మరింత మనోహరంగా ఉంటుంది. ఫొటోగ్రాఫర్ అంటే ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చితీరుతుంది.

అవీస్ ఐల్యాండ్


కర్మథాంగ్ :
కర్మథాంగ్ బీచ్ తాబేలు బ్రీడింగ్ సెంటర్. పర్యాటకులకు బుడిబుడి నడకలతో ముందుకువెల్లే చిన్న తాబేలు పిల్లలను చూస్తూ సంబరపడిపోయే ద`ష్యాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. ఇక్కడ తెల్లని ఇసుక తెన్నలు, పామ్ చెట్లు మనలను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి.ఇక్కడ మీరు సముద్రంలో వివిధ జాతులకు సంబంధించిన జీవన విధానాన్ని కూడా స్పష్టంగా చూడవచ్చు. కర్మథాంగ్ బీచ్ చూడటానికి మీకు రెండు గంటల సమయం పడుతుంది.బోట్ రైడింగ్ ఈ బీచ్లో మరో ప్రత్యేకత..

కర్మథాంగ్


రేహిల్స్ :
స్వచ్ఛమైన గాలి,వెలుతురు సమృద్ధిగా లభించే అతికొద్ది ద్వీపాల్లో రేహిల్స్ ద్వీపం కూడా ఒకటి.ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే అనుమతించే ఈ ద్వీపం చూడడానికి సుమారు ఆరేడు గంటల సమయం పడుతుంది.అండమాన్ నికోబార్ అటవీశాఖ ఆధీనంలో ఈ రే హిల్స్ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ అనేక జలక్రీడలు అందుబాటులో ఉంటాయి.ఎలిఫెంట్ రైడ్, ట్రెక్కింగ్, వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

రేహిల్స్


ఇంటర్వ్యూ ఐల్యాండ్ :
నగర రణగొణ ధ్వనులకు దూరంగా ప్రకృతి ఒడిలో వన్యప్రాణుల మధ్య గడపాలనుకునే వారికి ఈ ద్వీపం సరైన ప్రదేశం.ముఖ్యంగా ఏనుగులను వాటి సహజ ఆవాసంలో చూడాలనుకొనేవారి కోరిక ఇక్కడ తప్పకుండా తీరుతుంది.ఇక్కడ ట్రెక్కింక్ కోసం వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా జంగిల్ సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది.ఉదయం పూట మాత్రమే ఇక్కడకు వెళ్లడానికి అనుమతిస్తారు.

ఇంటర్వ్యూ ఐల్యాండ్


లక్ష్మణపుర బీచ్ :
అండమాన్ దీవుల్లో అతిపెద్దదైన లక్ష్మణపుర బీచ్‌ను సందర్శించాలంటే అర్ధ రోజు పడుతుంది.అయితే ఈ సముద్రతీరానికి పర్యాటకుల తాకిడి చాలా తక్కువగా ఉన్నా కొత్త పెళ్లైన జంటలు హనీమూన్‌కు మాత్రం లక్ష్మణపుర బీచ్ అనువైన ప్రదేశం.మిగిలిన ద్వీపాలతో పోలిస్తే ఈ ద్వీపంలో పర్యాటకుల తాకిడి చాలా తక్కువగా ఉండడం కూడా హనీమూన్ కోసం వచ్చే జంటలు ఈ ద్వీపాన్ని ఎంచుకుంటాయి.

లక్ష్మణ్‌పుర ద్వీపం


అండమాన్ జైలు :
అండమాన్ ద్వీపం పర్యటనకు వెళ్లే పర్యాటకులు అండమాన్ జైలును తప్పకుండా చూడాల్సిందే.ఒకప్పుడు భయంకరమైన శిక్షలకు,ఖైదీలకు పేరుగాంచిన అండమాన్ కాలక్రమేణ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే పర్యాటకులను అనుమతిస్తారు..

అండమాన్ జైలు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos