అప్పుడు అవినీతిపరులన్నారు…ఇప్పుడు పునీతులయ్యారా..?

అప్పుడు అవినీతిపరులన్నారు…ఇప్పుడు పునీతులయ్యారా..?

లక్నో : తెదేపా ఎంపీలు నలుగురు భాజపాలో చేరడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. భాజపాపై వ్యంగ్యోక్తులతో ట్వీట్‌ చేశారు. దేశ సంక్షేమం, దేశ అభివృద్ధిపై ఓ పక్క రాష్ట్రపతి హామీ ఇస్తుండగానే, మరో వైపు నలుగురు తెదేపా ఎంపీలు ఫిరాయింపులకు పాల్పడేలా భాజపా చేసిందని విమర్శించారు. వీరిలో ఇద్దరు అవినీతిపరులని గతంలో భాజపానే ఆరోపించిందని గుర్తు చేశారు. ఇప్పుడా ఎంపీలు పార్టీలో చేరాక కళంకం లేని వారిగా మారిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. తనదైన శైలిలో చేస్తున్న రాజకీయాల్లో భాజపాకు అన్ని విషయాలు సానుకూలంగానే కనబడుతున్నాయని చురకలు అంటించారు. కాగా తెదేపా రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, గరికపాటి రామ్మోహన్‌ రావు, టీజీ. వెంకటేశ్‌లు భాజపాలో చేరడమే కాకుండా తమ పక్షాన్ని ఆ పార్టీలో విలీనం చేస్తున్నట్లుగా చేసిన తీర్మాన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేసిన సంగతి తెలిసిందే.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos