అందరికీ ముసుగు (మాస్క్) అవసరం లేదు

అందరికీ ముసుగు (మాస్క్) అవసరం లేదు

హైదరాబాదు: కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరు ఎన్95 మాస్కులు ధరించాల్సిన పనిలేదు. అనారోగ్యంతో ఉన్నవారు ధరిస్తే సరిపోతుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) డైరెక్టర్ డాక్టర్ శంకర్ తెలిపారు. జ్వరం, దగ్గు లక్షణాలున్నవారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారంతా 60 ఏళ్ల పైబడినవారే. వారంతా అప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్య పరమైన సదుపాయాలు ఎన్ని ఉన్నప్పటికీ వైరస్ విస్తరించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ను పూర్తిగా పాటిస్తే వైరస్కు అడ్డుకట్ట వేయొచ్చు. పదేళ్ల లోపు చిన్నారులు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో అపోహలకు తావులేదని, పూర్తిగా శుభ్రం చేసి ఉడికించిన ఆహారం ఏదైనా తీసుకోవచ్చు. బయటకు వెళ్లినవారు సామాజిక దూరాన్ని తప్పకుండా పాటిస్తే వైరస్ విస్తరణను అడ్డుకోవచ్చ’ని డాక్టర్ శంకర్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos