కుప్పకూలిన మార్కెట్లు

కుప్పకూలిన మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను మూటకట్టు కున్నాయి. యూరప్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో మదుపర్లు వేచి చూసే ధోరణితో వ్యవహరించడం ఇందుకు కారణం. బీ ఎస్ ఈ సెన్సెక్స్ 599 పాయింట్లు నష్టపోయి 39,922కి, నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 11,729కి కూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో భారతి ఎయిర్ టెల్ (4.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.17%), మారుతి సుజుకి (0.33%), ఎల్ అండ్ టీ (0.12%) బాగా లాభాల్ని గడించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.45%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.34%), టెక్ మహీంద్రా (-3.00%), బజాజ్ ఫైనాన్స్ (-2.41%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.39%)అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos