మార్కెట్లను వెనక్కి లాగిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్

మార్కెట్లను వెనక్కి లాగిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్

ముంబై:దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 71,386కు చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 21,545 వద్ద స్థిరపడింది. భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభమయింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 72,035 పాయింట్లను చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టపోవడం మార్కెట్లపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్లో ఎల్ అండ్ టీ (1.55%), భారతి ఎయిర్ టెల్ (1.50%), టాటా మోటార్స్ (1.32%), సన్ ఫార్మా (1.25%), టాటా స్టీల్ (1.21%)లు సెన్సెక్స్లో బాగా లాభ పడ్డారు. నెస్లే ఇండియా (-1.03%), ఏసియన్ పెయింట్స్ (-0.90%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.88%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.80%), యాక్సిస్ బ్యాంక్ (-0.57%) అధికంగా నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos