ఎదురుకాల్పులు..! ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్‌

ఎదురుకాల్పులు..! ఇద్దరు మావోయిస్టుల  అరెస్ట్‌

తిరువనంతపురం: కేరళలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాళప్పుజా పోలీస్స్టేషన్ పరిధిలోని పెరియా ప్రాంతంలో కేరళ ప్రత్యేక బృందాలు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోన్ ఛార్జింగ్ కోసం ఇంట్లోకి వచ్చిన మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. సమాచారం మేరకు.. పలువురు మావోయిస్టలు అటవీ ప్రాంతం నుంచి ఫోన్ ఛార్జింగ్ కోసం ఇంట్లోకి వచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. ముగ్గురు మావోయిస్టులు తప్పించుకొని పారిపోగా.. మరో ఇద్దరు పట్టుబడగా.. వారిని సమీపంలోని పోలీస్ క్యాంప్కు తరలించినట్లు తెలుస్తున్నది. పట్టుబడ్డ మావోయిస్టుల వివరాలు తెలియరాలేదు. ఇటీవల కోజికోడ్లో మావోయిస్ట్ సానుభూతిపరుడిని అరెస్టు చేశారు. అతని నుంచి సేకరించిన సమాచారం మేరకు కేరళ పోలీసులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కమాండో బలగాలు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, రాష్ట్ర పోలీసులకు చెందిన ధండర్ బోల్డ్ స్క్వాడ్పై కాల్పులు జరిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos