మహిళ మావోయిస్టు కాల్చివేత

మహిళ మావోయిస్టు  కాల్చివేత

నారాయణపూర్ (చత్తీస్ఘడ్) : తూర్పు బస్తర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళ మావోయిస్టు మరణించాడు. ఇద్దరు జవాన్లు గాయపడినట్లు పోలీసులు ఇక్కడ తెలిపారు. ‘తూర్పు బస్తర్ డివిజన్ అడవుల్లో నక్సలైట్లు మందుపాతర అమర్చి పొదల్లో తుపాకులతో దాడికి వ్యూహం పన్నారు. చత్తీస్ ఘడ్ సాయుధ పోలీసులు, జిల్లా రిజర్వు గార్డులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సభ్యులు సంయుక్తంగా నక్సలైట్ల కోసం గాలింపు చేపట్టారు. అప్పుడు మావో యిస్టులు మందుపాతర పేల్చి పోలీసులపై కాల్పులకు దిగారు. పోలీసులు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. ఇందులో ఒక మావోయిస్టు మరణించాడు. ఇద్దరు జవాన్లు రాజ్ కుమార్, బాల్ కన్వర్ గాయపడ్డారు. వారి ప్రాథమిక చికిత్స చేసి హెలికాప్టరులో రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టులు నది దాటి పారిపోయార’ని పోలీసులు చెప్పారు. మహిళా నమావోయిస్టు మృతదేహంతోపాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్, 12 బోర్ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ గార్గ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos