మోదీ ఆటలు ఎంతో కాలం సాగవు

మోదీ ఆటలు ఎంతో కాలం సాగవు

న్యూఢిల్లీ: జియో వినియోగదార్లు ఇతర సంస్థలకు చెందిన చరవాణి వినియోగదార్లకు చేసిన ఫోన్లకు వినియోగ రుసుము విధించినందుకు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. ‘తమ వినియోగదారులపై చార్జీలు మోపాలని జియో నిర్ణయించింది. మీకు ఆఫర్ చేసిన లాలీపాప్ ఎంత పెద్దదైనా చివరికి ఏది ఉచితం కాదని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ప్రస్తుత మోదీ సర్కార్ది కూడా ఇదే పరిస్థితి.’ అని ట్విట్టర్లో వ్యాఖ్యా నించారు. జియో వినియోగదార్లు ఇతర చరవాణి సంస్థల వినియోగదార్లకు చేసే కాల్స్పై నిమిషానికి ఆరు పైసలు వంతున రుసుము విధించింది. ట్రాయ్ నూతన ఐయూసీ చార్జీల ప్రకటన ప్రకారం జియో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తప్పనిసరిగా టాక్టైమ్ టారిఫ్ ప్లాన్స్ అమలు చేయాల్సి ఉన్నం దున ఔట్ గోయింగ్ కాల్స్పై వసూలు చేసే చార్జిలకు ప్రతిగా ఉచిత డేటా వోచర్లు ఇవ్వనున్నట్లు జియో పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos