మన్‌ మోహనకు ఎస్పీజీ భద్రత రద్దు

మన్‌ మోహనకు ఎస్పీజీ భద్రత రద్దు

న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ప్రత్యేక భద్రతా బృందం(ఎస్పీజీ) భద్రతను రద్దు చేసిన కేంద్రం ఆయన్ను Z+ భద్రతకు పరిమితి చేసింది. ప్రస్తు తం ఎస్పీజీ హోదా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ జాతీయా ధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరు లకు కొనసాగు తోంది. ముప్పు ప్రాతిపదికన మన్మోహన్‌ సింగ్‌కు భద్రత తగ్గించామని హోం శాఖ సోమవారం ఇక్కడ వెల్లడించింది.
20 14 వరకు మన్మో హన్ భార్య గురశరణ్‌ సింగ్‌, కుమార్తెలకు ఎస్పీజీ హోదా ఉండేది. తమకు అవి అవసరం లేదని మన్మోహన్‌ కుమార్తెలు గతంలోనే చెప్పారు. వ్యక్తిగత భద్రత గురించి మన్మోహన్‌కు ఎలాంటి ఆందోళనా లేదని ఆయన సన్నిహితులు తెలిపారు. మాజీ ప్రధానుల ఎస్పీజీ భద్రత రద్దు చేయటం ఇదే తొలిసారి కాదు. గతంలో మాజీ ప్రధానులు హెచ్‌డీ దేవెగౌడ, వీపీ సింగ్లకూ ఇలాగే జరిగింది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయీకి మాత్రం ఆయన మరణించే వరకూ ఎస్పీజీ భద్రత కొనసాగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos