సంతకం పెట్టాక పడకసుఖం కావాలనేవారు..

  • In Film
  • December 8, 2019
  • 124 Views
సంతకం పెట్టాక పడకసుఖం కావాలనేవారు..

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఇది వరకు ఎంతోమంది తారలు విమర్శలు,ఆరోపణలు చేయగా తాజాగా మంజరి ఫడ్నిస్‌ కూడా ఈ జాబితాలో చేరింది. కొందరు దర్శకనిర్మాతలు తనకు అవకాశం ఇచ్చి, అడ్వాన్స్ కూడా ఇచ్చారని.. అయితే తీరా ఆ సినిమాకు సంతకం చేసిన తర్వాత పడక సుఖం తీర్చాల్సిందిగా కోరేవారని చెప్పుకొచ్చింది. నిజానికి తనకు చాలా పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చినా.. దర్శక నిర్మాతలు ఏమాత్రం సిగ్గులేకుండా పడుకుంటావా అని అడిగారని, అందుకే ఆ అవకాశాలు వదులుకున్నానని చెప్పింది. తాను సినిమాల్లో ఎక్కువకాలం కొనసాగలేక పోవడానికి ప్రధాన కారణం అదేనని తన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాల వలన చాలా కాలం డిప్రెషన్‌లో కూడా ఉండిపోయానని చెప్పుకొచ్చింది.చిత్రసీమలో పడక సుఖం అందిస్తే తప్ప అవకాశాలు రావని మంజరి చేసిన ఈ ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos