ఏం సెప్తిరి లక్ష్మక్క..

  • In Film
  • March 8, 2019
  • 234 Views
ఏం సెప్తిరి లక్ష్మక్క..

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాలకు ప్రాధాన్యత దక్కదని చిన్న చిత్రాలను పెద్ద నిర్మాతలకు తొక్కేస్తున్నారని దశాబ్ద కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధానంగా వినిపిస్తున్న విమర్శలు, ఆరోపణలు.కేవలం నలుగురు నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను శాసిస్తున్నారని పండగలు,వేసవి శెలవుల్లో తమ చిత్రాలకు లేదా తాము పంపిణీహక్కులు తీసుకున్న పెద్ద చిత్రాలకు మాత్రమే థియేటర్లు కేటాయిస్తూ చిన్న చిత్రాలను తొక్కేస్తున్నారంటూ చిన్న చిత్రాల నిర్మాతలు తరచూ చేసే ఆరోపణలు. నిర్మాత నట్టికుమార్‌ చిన్న చిత్రాల నిర్మాతలు,దర్శకుల తరపున ఎప్పుడూ ఏదో ఒక విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉంటారు.ఈ కోవలోకి డైలాగ్‌కింగ్‌ మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీ కూడా చేరారు.తను నటించిన మిసెస్‌ సుబ్బలక్ష్మీ అనే వెబ్‌సిరీస్‌ లాంఛింగ్‌ ఈవెంట్‌లో మంచు లక్ష్మీ చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేశారు.చిత్రాలు నిర్మించాలంటే భయపడాల్సి వస్తోందని చిత్రాన్ని నిర్మించిన అనంతరం చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం ముఖ్యంగా నిర్మాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఒకవేళ నిర్మాత అదృష్టం బాగుండి విడుదలైన చాలా తక్కువ థియేటర్లు దొరుకుతాయని అది కూడా ఎన్నిరోజులు ఉంటుందో తెలియక నిర్మాత ప్రతీరోజూ భయపడుతూ ఉంటారన్నారు.నెలల తరబడి కుటుంబాలను వదిలేసి వందలామంది కార్మికులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చిత్రాలు నిర్మిస్తే విడుదలయ్యాక ఏదో పెద్ద చిత్రం విడుదలవుతోందంటూ చిన్న చిత్రాలు తొలగించినపుడు చాలాసార్లు బాధపడ్డానన్నారు.రెండు రాష్ట్రాల్లో థియేటర్లు కేవలం ఐదారు మంది చేతుల్లో ఇరుక్కుపోయాయని ఈ కొద్దిమంది వల్ల చిన్న చిత్రాలకు భవిష్యత్తు లేకుండా పోతోందన్నారు.చిన్నపెద్ద అనే తేడా చూడకుండా నిర్దాక్షణ్యంగా చిత్రాలు తొలగించి తమ చిత్రాలను మాత్రమే విడుదల చేస్తుంటారని వారిని నిలదీసే అవకాశం కూడా ఇవ్వరన్నారు. మోహన్‌బాబు కూతురు సినిమా కాబట్టి ఒక వారం రోజులైనా థియేటర్‌లో ఉంచుదామనే ఆలోచన కూడా ఆ ఐదారుమందికి లేదన్నారు.వెబ్‌సిరీస్‌లు ప్రస్తుతం థియేట్రికల్‌ అనుభవాన్ని అదే క్వాలిటీతో ఇస్తున్నాయని అందుకే చాలా మంది కొత్త చిత్రాలను నెట్‌ఫ్లిక్స్‌,అమేజాన్‌ ప్రైమ్‌లలో చూడడానికి ఎదురు చూస్తున్నారన్నారు.కథలతో ప్రయోగాలు చేయడానికి వెబ్‌సిరీస్‌ మంచి ప్లాటఫామ్‌ అన్నారు. ఇదిలా ఉంటే గత నాలుగైదేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాల హావా మొదలైందనే చెప్పాలి. కథలో విషయం ఉంటే చిన్నపెద్దా చూడకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.చాలా మంది యువ హీరోలు చిన్నచిత్రాలతోనే ప్రస్తుతం స్టార్లుగా ఎదిగారు.తమకు నచ్చిన పాతకాలం నాటి మూస కథలనే ప్రయోగాల పేరుతో ప్రేక్షకులపై రుద్దుతూ తమ చిత్రాన్ని తొక్కేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టో ఆరోపణలు చేసే వ్యక్తులు ఒకసారి ఆలోచించుకోవాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos