మా`విడాకులు’ : మంచు మనోజ్

  • In Film
  • October 17, 2019
  • 141 Views
మా`విడాకులు’ : మంచు మనోజ్

హీరో మంచు మనోజ్, భార్య ప్రణతి మధ్య సత్సంబంధాలు లేవని ఇటీవల వినవస్తోంది. మనస్పర్ధలుతలెత్తడంతో ఇద్దరూ కలిసి ఉండడం లేదని గత రెండేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరి రిలేషన్ పై క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈరోజు మీకో ముఖ్యమైన విషయం చెబుతానని టైం కూడా చెప్పిన మంచు మనోజ్, తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఇద్దరికి ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉన్నా, కలిసి జీవించలేమని తేల్చేశాడు. తన మనసు సరిగ్గా లేకపోవడం వలనే ఇన్నాళ్లు పని మీద శ్రద్ధ పెట్టలేకపోయానని చెప్పాడు. ఈ బాధలో తన కుటుంబం వెన్నంటే ఉందని.. ఇకపై తన బాధను పక్కన పెట్టి సినిమాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రణతిని చాలా కాలం పాటు ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. తర్వాత కొన్నాళ్ల నుంచే వీరిద్దరూ విడి విడిగా ఉంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos