వారు ఓట్ల కోసం ప్ర‌జ‌ల ముందు వాలే వ‌ల‌స ప‌క్షులు

వారు ఓట్ల కోసం ప్ర‌జ‌ల ముందు వాలే వ‌ల‌స ప‌క్షులు

కోల్ కతా: : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బెంగాల్లోని కూచ్బెహర్లో శుక్రవారం జరిగిన ర్యాలీలో బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వచ్చిన వెంటనే కొందరు నేతలు ఓట్ల కోసం ప్రజల ముందు వాలిపోతారని, ఎన్నికల తర్వాత ఏ ఒక్కరూ కనిపించరని, ఎలాంటి పనులూ చేయరని దీదీ అన్నారు. తాము ఎలాంటి ఆరోపణలు, అవినీతి మరకలు లేని అభ్యర్ధిని బరిలో నిలిపితే కాషాయ పార్టీ అభ్యర్ధి రాక్షసుడని, ఆయనపై ఎన్నో కేసులున్నాయని ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధి బాగోతాలపై తన వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని, వాటిని బయటపెట్టగలనని మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ అభివృద్ధికి కట్టుబడిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెంగాల్లో భద్రత లేదని కాషాయ నేతలు ప్రచారం చేస్తున్నారని, మరి రాజస్ధాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ సురక్షితమా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అసలు వాళ్లేం అభివృద్ధి చేశారని తాను వారిని నిలదీస్తున్నానన్నారు. జల్పాయిగురిలో ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించిందని, వారికి కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేసిందని దీదీ ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos