జై షాకు బీసీసీఐలో ఉన్నత పదవి ఎలా వచ్చింది?

న్యూ ఢిల్లీ : వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతున్న బీజేపీ అమిత్ షా కుమారుడు జై షాకు బీసీసీఐలో అత్యున్నత పదవి ఎలా దక్కింది. దీని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. ‘ఇండియా టుడే కాన్క్లేవ్ ఈస్ట్-2022’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ‘నా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లో ఉండడం వల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా? ప్రజలు అతడిని రెండుసార్లు ఎన్నుకున్నా రు. దేశ బాధ్యతలను యువత చేపట్టాలని మీకు లేదా?. మహా రాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొనసాగుతుందని భావించడం లేదు. అది అనైతిక, అప్రజాస్వామిక సర్కా రు. వారు ప్రభుత్వా న్నయితే ఏర్పాటు చేశారు కానీ, ప్రజల హృదయాలను మాత్రం గెలవలేరు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేయవచ్చని, కానీ అదే ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించి ప్రజలు వారిని కిందికి దింపుతార’ని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos