మమ్ముట్టి మామాంగం ట్రైలర్‌..

  • In Film
  • November 9, 2019
  • 137 Views
మమ్ముట్టి మామాంగం ట్రైలర్‌..

మలయాళంలో సీనియర్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న మమ్ముట్టిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. విజయవంతమైన ఎన్నో వైవిధ్యభరితమైన కథా చిత్రాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి.తాజాగా‘మామాంగం’ అనే టైటిల్‌తో మలయాళంలో రూపొందిన ఈ సినిమా, అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకులను ఈ నెల 21వ తేదీన పలకరించనుంది. ఉన్నిముకుందన్ .. ప్రాచీ తెహ్లాన్ .. అను సితార ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను వదిలారు. ఆసక్తికరమైన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ అంచనాలు పెంచుతోంది. చారిత్రక నేపథ్యంలో .. 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా, మమ్ముట్టి కెరియర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos