డ్రగ్స్ ​కేసుపై మహారాష్ట్ర మంత్రి ఆరోపణలు

డ్రగ్స్ ​కేసుపై మహారాష్ట్ర మంత్రి  ఆరోపణలు

ముంబయి : నటుడు షారుఖ్ తనయుడు అరెస్టైన మాదకద్రవ్యాల కేసులో ముగ్గురిని ఒక భాజపా నాయకుడి ప్రొద్బలంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు తప్పించారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. సంబంధిత వీడియోల్ని విడుదల చేశారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘క్రూయిజ్ షిప్పై దాడి అనంతరం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. వారిలో 8 మందిని మాత్రమే అరెస్టు చేశారు. . రిషభ్ సత్యదేవ్, ప్రతిక్ గాబా, అమిర్ ఫర్నిచర్వాలాను ఓ భాజపా నాయకుడితో మాట్లాడిన అనంతరం ఎన్సీబీ అధికారులు విడుదల చేశారు. ఆ ముగ్గురిని ఎవరి ఆదేశాల మేరకు డ్రగ్స్ కేసు నుంచి తప్పించారో ఎన్సీబీ తెలపాల’ని డిమాండ్ చేశారు. దీని గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకూ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos